మరో 15 విమానాశ్రయాల్లో ఫేస్ బయోమెట్రిక్ ఆధారిత డిజి యాత్ర సేవలు

by Harish |
మరో 15 విమానాశ్రయాల్లో ఫేస్ బయోమెట్రిక్ ఆధారిత డిజి యాత్ర సేవలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: విమాన ప్రయాణికులు సులభంగా రాకపోకలు చేసేందుకు వీలుగా ఉపయోగపడే డిజి యాత్ర సేవలను ఉపయోగించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని డిజియాత్ర ఫౌండేషన్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటివరకు డిజి యాత్ర ప్లాట్‌ఫారమ్‌లో నమోదిత వినియోగదారులు 4 మిలియన్ల మార్కును అధిగమించారని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. అలాగే, ప్రస్తుతం 14 విమానాశ్రయాలలో ఇది అందుబాటులో ఉండగా, అదనంగా మరో 15 విమానాశ్రయాలకు విస్తరింపజేస్తామని, దీంతో డిజి యాత్ర సేవలు అందుబాటులో ఉండే విమానాశ్రయాల సంఖ్య 29కు చేరుతుందని ఫౌండేషన్‌ తెలిపింది.

డిజి యాత్ర ద్వారా విమానాశ్రయాల్లో పలు చెక్‌ పాయింట్ల వద్ద ప్రయాణికులు ముఖ గుర్తింపు సాంకేతికత (ఎఫ్‌ఆర్‌టీ) ద్వారా సులభంగా ముందుకు వెళ్లొచ్చు. దీనిని డిసెంబర్ 2022లో ప్రారంభించారు. మొదట్లో, ఇది ఢిల్లీ, బెంగళూరు, వారణాసిలోని మూడు నగరాల్లో ప్రారంభించగా, తరువాత ముంబై, హైదరాబాద్, పూణె, కోల్‌కతాతో సహా దేశంలోని ప్రధాన విమానాశ్రయాలకు విస్తరించారు. డిజి యాత్ర ద్వారా, ప్రయాణీకులు విమానాశ్రయ ప్రవేశ సమయం 15-20 నిమిషాల నుండి 5 నిమిషాలకు తగ్గింది. డిజి యాత్రకు నోడల్ ఏజెన్సీగా లాభాపేక్ష లేని సంస్థ డిజి యాత్ర ఫౌండేషన్‌ ఉంది. దీనిలో సభ్యులుగా ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, హైదరాబాద్, కొచ్చిన్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లు ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed