సంస్థను పునర్నిర్మించే ప్రయత్నాల్లో డన్‌జో!

by Vinod kumar |
సంస్థను పునర్నిర్మించే ప్రయత్నాల్లో డన్‌జో!
X

బెంగళూరు: నిధుల సమస్యను ఎదుర్కొంటున్న ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ డన్‌జో ఈ త్రైమాసికంలో సంస్థ పునర్నిర్మాణాన్ని చేపట్టనున్నట్టు సోమవారం ప్రకటించింది. కంపెనీ సహ-వ్యవస్థాపకుల్లో ఒకరైన దల్‌వీర్ సూరి రాజీనామా చేసిన నేపథ్యంలో కంపెనీ ఈ విషయాన్ని వెల్లడించింది. డన్‌జో గడిచిన కొన్ని నెలల నుంచి నిధుల సమీకరణ విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే మూడు రౌండ్లలో పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించింది. మరికొందరు ఉద్యోగులకు జీతాలను వాయిదా వేయడం, కొందరికి సగం జీతాలిచ్చింది.

సంస్థ పునర్నిర్మాణంపై వివరాలను త్వరలో వెల్లడించనున్నట్టు డన్‌జో సీఈఓ కబీర్ బిస్వాస్ అన్నారు. దల్‌వీర్ సింగ్ రాజీనామాపై స్పందించిన కబీర్, 2015లో కంపెనీలో చేరిన తర్వాత నుంచి సంస్థ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా బిజినెస్-టు-బిజినెస్ లాజిస్టిక్స్ విభాగమైన డంజో మర్చంట్ సర్వీసెస్ కార్యకలాపాలను విజయవంతంగా నిర్వహించారు. కాగా, ఇటీవల డన్‌జోలో 25.8 శాతం వాటాను రిలయన్స్ రిటైల్‌కు విక్రయించి సుమారు రూ. 200-250 కోట్ల నిధుల సమీకరణకు చర్చలు నిర్వహిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed