Dr. Reddy's Q2 Results: రెండో త్రైమాసికంలో డాక్టర్ రెడ్డీస్ లాభం రూ. 1,342 కోట్లు

by Maddikunta Saikiran |
Dr. Reddys Q2 Results: రెండో త్రైమాసికంలో డాక్టర్ రెడ్డీస్ లాభం రూ. 1,342 కోట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్(HYD) కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న ప్రముఖ ఫార్మా కంపెనీ(Pharma Company) డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్‌(Dr. Reddy's Laboratories) జులై-సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల(July-September Quarter Results)ను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25) రెండో త్రైమాసికం(Q2FY25) ఆర్థిక ఫలితాల్లో ఆ సంస్థ రూ. 1,342 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. కాగా గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసిక ఫలితాల్లో నమోదైన రూ. 1480 కోట్లతో పోలిస్తే ఈ సారి 9.35 శాతం లాభాలు తగ్గాయని సంస్థ తన రెగ్యులేటరీ ఫైలింగ్(Regulatory Filing)లో పేర్కొంది. ఇక సంస్థ కార్యకలాపాల ఆదాయం 16.51 శాతం వృద్ధితో రూ. 6,880 కోట్ల నుంచి రూ. 8,016 కోట్లకు చేరినట్లు తెలిపింది. ఒక త్రైమాసిక కాలంలో రూ. 8000 కోట్ల ఆదాయాన్ని సాధించడం ఇదే మొదటిసారని కంపెనీ వెల్లడించింది. త్రైమాసిక ఫలితాలపై డాక్టర్ రెడ్డీస్ కో-ఛైర్మన్‌, ఎండీ జీవీ ప్రసాద్‌(GV Prasad) మాట్లాడుతూ.. రెండో త్రైమాసికంలో లాభాలు తగ్గిన సంస్థ ఆదాయం పెరిగిందని, నార్త్ అమెరికా మార్కెట్లో మెడిసిన్ ధరలు తగ్గడం వల్లనే లాభాల్లో కోత పడిందని తెలిపారు. మరోవైపు నికోటినెల్‌, నెస్లే విలీనం త్వరలోనే పూర్తి కానున్నదని, ప్రధాన వ్యాపారాలను పటిష్టం చేసుకుంటూ ముందుకు పోతామని అన్నారు

Advertisement

Next Story

Most Viewed