- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అయోధ్య రాముడికిచ్చే విరాళానికి పన్ను మినహాయింపు ఉందని తెలుసా..
దిశ, బిజినెస్ బ్యూరో: అయోధ్యలో జరిగిన బాల రాముడి ప్రాణప్రతిష్ట నేపథ్యంలో చాలామంది రామాలయానికి పెద్ద ఎత్తున విరాళాలకు ముందుకు వస్తున్నారు. ఇటీవలే భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్) ద్వారా చేసే విరాళాలు రెట్టింపు స్థాయిలో పెరిగాయని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో రామాలయం నిర్మాణం కోసం విరాళ ఇచ్చేవారికి పన్ను మినహాయింపు పొందే వీలుంది. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80జీ కింద మినహాయింపు కోరవచ్చు. రామాలయం పునరుద్ధరణ, మరమ్మత్తు పనుల నిమిత్తం విరాళం అందించే మొత్తంలో 50 శాతంపై పన్ను మినహాయింపు పొందే వీలుంటుంది. సెక్షన్ 80జీ అనేది ఆధ్యాత్మిక సంస్థలకు వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులు, కంపెనీలు ఇచ్చే విరాళానికి పన్ను మినహాయింపు వర్తించే సెక్షన్. అయితే, అన్ని సంస్థలు ఇచ్చే విరాళాలపై ఈ మినహాయింపు లభించదు. ఆదాయపు పన్నుల విభాగం అధికారిక వెబ్‌సైట్ సూచించే వాటికి మాత్రమే ఇది వర్తిస్తుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆదాయ పన్ను చట్టం-1961లో 80జీ(బీ)(2) సెక్షన్‌ను చేర్చారు. ఈ సెక్షన్ కింద రామ మందిర ట్రస్టుకు ఇచ్చే విరాళంలో 50 శాతం మొత్తంపై పన్ను మినహాయింపు లభిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో వచ్చిన మొత్తం ఆదాయాన్ని బట్టి దీన్ని నిర్ణయిస్తారు. ఐటీ రిటర్నులను దాఖలు చేసే సమయంలో విరాళానికి సంబంధించిన రశీదు ఉండాలి.