- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Federal Bank: బ్యాంకుల్లో డిపాజిట్ల పెరుగుదల లేకపోవడం అతిపెద్ద సమస్య: ఫెడరల్ బ్యాంక్
దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ రంగంలో డిపాజిట్లు తగ్గుతున్నాయి. కస్టమర్లకు పెట్టుబడి అవకాశాలు పెరగడం, ప్రత్యామ్నాయ మార్గాలను వారు ఎంచుకుంటున్న నేపథ్యంలో డిపాజిట్ల వృద్ధి దేశీయ బ్యాంకింగ్ రంగానికి అతిపెద్ద సవాలుగా మారిందని ఫెడరల్ బ్యాంక్ రిటైల్ బిజినెస్ హెడ్ షాలిని వారియర్ అన్నారు. సోమవారం జాతీయ మీడియాతో మాట్లాడిన ఆమె.. వినియోగదారులు ఆశించిన స్థాయిలో ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లలో పెరుగుదల లేనప్పుడు, వారు ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గాల కోసం చూస్తారని చెప్పారు. గత కొన్ని త్రైమాసికాలుగా డిపాజిట్లు తగ్గుతున్నాయి. దీన్ని బ్యాంకింగ్ రంగ ఉన్నతాధికారులు గమనించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ ఈ విషయంలో బ్యాంకులు డిపాజిట్లు పెంచడం, అందుకోసం కొత్త ఉత్పత్తులను, సేవింగ్ ఉత్పత్తులను పెంచే చర్యలు తీసుకోవాలని బ్యాంకింగ్ రంగాన్ని కోరారని షాలిని వారియర్ వివరించారు.