- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈ ఏడాది 6 ప్రధాన నగరాల్లో ఆఫీస్ స్పేస్‌కు పెరగనున్న డిమాండ్
దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది భారత్‌లో పలు కంపెనీలు తమ వ్యాపారాలను విస్తరించాలని చూస్తున్న దృష్ట్యా ఆఫీస్ స్పేస్‌కు భారీ డిమాండ్ ఏర్పడుతుందని FICCI, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కొలియర్స్ తాజా నివేదికలో పేర్కొన్నాయి. ముఖ్యంగా కంపెనీలు 50-55 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణాన్ని లీజుకు తీసుకోవాలని భావిస్తున్నాయి. ఆరు ప్రధాన నగరాల్లో ఆఫీస్ స్పేస్ డిమాండ్ ఈ సంవత్సరం ఆరోగ్యకరమైన స్థితిలో ఉంటుందని నివేదిక అంచనా వేసింది.
బెంగళూరు, చెన్నై, ఢిల్లీ-NCR, హైదరాబాద్, ముంబై, పూణే వంటి ఆరు ప్రధాన నగరాల్లో 58.2 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆఫీస్ స్పేస్ స్థూల లీజింగ్‌కు డిమాండ్ ఉంది. కొలియర్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అర్పిత్ మెహ్రోత్రా మాట్లాడుతూ, దేశీయ కంపెనీలు 2024లో ఆఫీస్ స్పేస్ విభాగంలో ఊహించిన దానికంటే దాదాపు సగం వాటాను అందించే అవకాశం ఉంది, గ్రేడ్ A ఆఫీస్ స్పేస్ లీజింగ్ ఇటీవలి సంవత్సరాలలో గణనీయంగా ఊపందుకుంది. మొత్తం లీజింగ్‌లో దాని వాటా 2019లో 34 శాతం నుండి 2023లో దాదాపు 50 శాతానికి పెరిగిందని అన్నారు.
ప్రపంచదేశాలతో పోలిస్తే భారత్‌లో కంపెనీల ఏర్పాటుకు ఆరోగ్యకరమైన వాతావరణం ఉండటం, దేశ ఆర్థిక వ్యవస్థ కూడా రానున్న రోజుల్లో వృద్ధి చెందటం వలన దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ కంపెనీలు భారత్‌లో తమ వ్యాపారాలను విస్తరించాలని చూస్తున్నాయి. అలాగే, ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయడం ముగించి కరోనా ముందులా ఆఫీస్ నుంచి పనిచేయడం ప్రారంభం అయిన నేపథ్యంలో ఆఫీస్ స్పెస్‌కు డిమాండ్ పెరుగుతుందని నివేదిక అభిప్రాయపడింది.