Retirement Planning: ఈ రిటైర్మెంట్‌ సేవింగ్స్‌ ప్లాన్‌ గురించి తెలుసుకోండి.. ఎలాంటి సమస్యా మీ దగ్గరకు రాదు

by Vennela |
Retirement Planning: ఈ రిటైర్మెంట్‌ సేవింగ్స్‌ ప్లాన్‌ గురించి తెలుసుకోండి.. ఎలాంటి సమస్యా మీ దగ్గరకు రాదు
X

దిశ, వెబ్‌డెస్క్: Retirement Planning: చాలా మంది పదవి విరమణ తర్వాత ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా గడపాలని కోరుకుంటారు. లేదంటే ఇతరులపై ఆధారపడి ఇబ్బందికర జీవితాన్ని వెల్లదీయాల్సి వస్తుంది. అందుకే రిటైర్మెంట్( Retirement) అయ్యేలోపు ఎంతో కొంత డబ్బును ఆదా చేసుకుంటే..హ్యాపీగా జీవించవచ్చు. అయితే ఈ డబ్బును ఎలా పొదుపు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

రిటైర్మెంట్ కార్పస్(Retirement corpus) అంటే మీరు జీవిత కాలంలో సురక్షితంగా జీవించేందుకు అవసరమైన పొదుపు స్కీము(Savings scheme). ఇది మీ రిటైర్మెంట్( Retirement) తర్వాత మంచి జీవన ప్రమాణాన్ని కొనసాగించేందుకు అవసరమైన డబ్బును మీకు అందిస్తుంది. ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో మనందరికీ భవిష్యత్తుపై ఆందోళన ఉండటం సాధారణమే. వస్తువుల ధరలు పెరుగుదల, జీవన వ్యయం ఎప్పుడూ తగ్గడం లేదు. అందుకే మీరు రిటైర్మెంట్ తర్వాత సౌకర్యవంతంగా జీవించాలనుకుంటే పదవి విరమణ సమయంలో మీ దగ్గర కొంత పొదుపు ఉండటం చాలా ముఖ్యం.

పదవి విరమణ( Retirement) తర్వాత మంచి జీవితం గడిపేందుకు ఎంత డబ్బు పొదుపు చేసి పెట్టుకోవాలనేది చాలా మందిలో మెదులుతున్న ప్రశ్న. ఈ ప్రశ్నకు ఎవరి దగ్గర సరైస సమాధానం ఉండదు. కాబట్టి దీనికి కచ్చితంగా సమాధానం తెలుసుకోవాలి. లేదంటే తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొవల్సి ఉంటుంది. రిటైర్మ్ మెంట్ కార్పస్ (Retirement corpus)అనేది మీరు పొదుపు రూపంలో కలిగి ఉండాల్సిన డబ్బు. దీంతో మీరు రిటైర్మెంట్ తర్వాత సౌకర్యవంతంగా జీవిస్తారు. రిటైర్మెంట్ ప్లాన్(Retirement Plan) పై నిపుణుల అభిప్రాయాలు, ఎలా ప్లాన్ చేయాలో తెలుసుకుందాం.

రిటైర్మెంట్ తర్వాత ఆరోగ్య సంరక్షణ(Healthcare) ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది రిటైర్మెంట్ తర్వాత అవసరమైన డబ్బులో పెద్ద భాగం. అందుకే ఈ రంగాన్ని ప్రత్యేకంగా ప్రణాళికలో భాగంగా తీసుకోవాల్సి ఉంటుంది. రిటైర్మెంట్ ప్లాన్(Retirement corpus) కోసం కొన్ని ప్రసిద్ధ విధానాలు ఉన్నాయి. ఇవి 25×, 4% గణనలు. ఈ గణనల ద్వారా మీరు ఎంత డబ్బు పొదువు చేసుకోవాలో అర్ధం చేసుకోవచ్చు. 25× నియమం ప్రకారం..రిటైర్మెంట్ సమయంలో ఒక వ్యక్తికి తన వార్షిక ఖర్చులు 25రెట్లు ఉండాలి. అంటే ఒక వ్యక్తి వార్షిక ఖర్చులు 25లక్షలు అయితే.. అతనికి 2కోట్ల కార్పస్ తయారవుతుంది.

4% నియమం ప్రకారం మీరు రిటైర్మెంట్ కార్పస్ నుంచి ప్రతి ఏడాది 4శాతం కేటాయించవచ్చు. అంటే మీరు అనుకున్న మొత్తాన్ని సురక్షితంగా ఉపయోగించుకోవచ్చు. ఈక్విటి పెట్టుబడులు(Equity investments) రిటైర్మెంట్ కోసం ఈక్విటి పెట్టుబడులు చాలా మంచి ఎంపిక అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇవి అధిక లాభాలను అందిస్తుంటాయి. రిటైర్మెంట్ కార్పస్ ఏర్పాటుకు ముందు మీరు మీ రిటైర్మెంట్ లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. మీరు ఎప్పుడు రిటైర్ కావాలని భావిస్తారో ముందే నిర్ణయించుకోవడం ద్వారా లక్ష్యాలను సాధించడం చాలా సులభం అవుతుంది.

సరైనా ప్రణాళికతో రిటైర్మెంట్ కార్పస్ ఏర్పాటు చేయడంలో ఎలాంటి సమస్యలు ఉండవు. మీరు 25×, 4% నియమాలను అనుసరించి మీ లక్ష్యాల ప్రకారం ముందుగానే ప్రణాళిక వేసుకుంటే మంచిది.

Next Story