చందా కొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌‌పై చార్జిషీట్‌ దాఖలు చేసిన సీబీఐ

by Harish |   ( Updated:2023-04-08 08:43:38.0  )
చందా కొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌‌పై చార్జిషీట్‌ దాఖలు చేసిన సీబీఐ
X

ముంబై: ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ ఎండీ, సీఈవో చందా కొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌, వీడియోకాన్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుడు వేణుగోపాల్‌ ధూత్‌లపై సీబీఐ చార్జిషీట్‌ దాఖలు చేసినట్లు అధికారులు శనివారం తెలిపారు. రూ.3,250 కోట్ల రుణం మోసం కేసులో భాగంగా భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్లు 120-B (నేరపూరిత కుట్ర), 409 (నేరపూరిత విశ్వాస ఉల్లంఘన), అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనల కింద ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు.

వీడియోకాన్ గ్రూపునకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలతో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవోగా 2018లో చందా కొచ్చర్ వైదొలిగారు. 2012లో బ్యాంక్ సీఈవో హోదాలో రూ. 3250 కోట్ల రుణం మంజూరు చేయడం, అది నిరర్ధక ఆస్తిగా మారడంతో తద్వారా ఆమె కుటుంబ లబ్ధి పొందినట్లు సీబీఐ ఆరోపించింది. ఈ కేసులో భాగంగానే తాజాగా, వేణుగోపాల్‌ ధూత్‌, చందా కొచ్చర్ తో పాటు ఆమె భర్తపై సీబీఐ అధికారులు చార్జిషీట్‌ దాఖలు చేశారు.

Advertisement

Next Story