- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఉద్యోగులకు జీతాల్లో కొంత మొత్తాన్ని చెల్లిస్తున్న బైజూస్
దిశ, బిజినెస్ బ్యూరో: కష్టాల్లో ఉన్నటువంటి ప్రముఖ ఎడ్‌టెక్ ప్లాట్‌ఫామ్ బైజూస్ ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి నెలకు సంబంధించి 20,000 మంది ఉద్యోగుల జీతాలను మార్చి 10 లోగా చెల్లిస్తామని కంపెనీ వ్యవస్థాపకుడు రవీంద్రన్ గతంలో తన ఉద్యోగులకు రాసినటువంటి లేఖలో పేర్కొనగా, అయితే పూర్తి స్థాయిలో కాకుండా జీతంలో కొంత మొత్తాన్ని ఉద్యోగులకు వారి అకౌంట్లలో జమ చేస్తున్నట్లు తెలిపారు. మిగిలిన అమౌంట్‌ను రైట్స్ ఇష్యూ ద్వారా సేకరించిన నిధులు అందుబాటులోకి వచ్చిన తర్వాత చెల్లిస్తామని తాజాగా స్పష్టం చేశారు.
తమ ఉద్యోగులకు రోజువారీ ఖర్చులకు ఇబ్బందులు రాకుండా చూసుకోవడానికి ప్రత్యామ్నాయ నిధుల ఏర్పాట్ల ద్వారా కొంత జీతాన్ని చెల్లిస్తున్నామని త్వరలో మిగిలిన బ్యాలెన్స్‌ను కూడా చెల్లిస్తామని కంపెనీ తెలిపింది. దిగువ స్థాయి తక్కువ జీతం కలిగిన ఉద్యోగులకు పూర్తిగా చెల్లించగా, మధ్య నుండి సీనియర్ స్థాయి కలిగిన వారికి పాక్షికంగా చెల్లించారు. శుక్రవారం జీతాల చెల్లింపు ప్రాసెస్‌ను పూర్తి చేశారు. రెండవ శనివారం, లాంగ్ వీకెండ్ కారణంగా మార్చి 11న ఖాతాల్లో జీతాలు పడతాయని కంపెనీ యాజమాన్యం పేర్కొంది. కంపెనీ రైట్స్ ఇష్యూ ద్వారా సేకరించిన $250-$300 మిలియన్లను పెట్టుబడిదారులతో కేసును పరిష్కరించే వరకు ప్రత్యేక ఖాతాలో ఉంచాలని బైజూస్‌ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT)ఆదేశించింది. దీంతో కంపెనీ ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి ఇబ్బందులు ఎదుర్కొంటుంది.