BSNL: బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు శుభవార్త.. డేటాతో సంబంధం లేకుండా 500 లైవ్ టీవీ ఛానళ్లు వీక్షించే అవకాశం..!

by Maddikunta Saikiran |   ( Updated:2024-11-17 12:43:17.0  )
BSNL: బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు శుభవార్త.. డేటాతో సంబంధం లేకుండా 500 లైవ్ టీవీ ఛానళ్లు వీక్షించే అవకాశం..!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ రంగానికి చెందిన దిగ్గజ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఫైబర్ నెట్(Fiber Net) యూజర్ల కోసం IFTV పేరిట కొత్త సర్వీస్(New service)లను ప్రారంభించింది. ఇందులో 500కి పైగా లైవ్ టీవీ ఛానళ్లు ఉన్నాయి. ఈ లైవ్ టీవీ ఛానళ్లు డేటాతో సంబంధం లేకుండా లభిస్తాయని తెలిపింది. బఫర్ సమస్య లేకుండా హై స్ట్రీమింగ్ క్వాలిటీతో వీటిని వీక్షించవచ్చని పేర్కొంది. ఈ మేరకు బీఎస్ఎన్ఎల్ 'ఎక్స్(X)'లో పోస్ట్ చేసింది. ప్రస్తుతానికి IFTV సర్వీసులు ఆండ్రాయిడ్ టీవీల్లో మాత్రమే లభిస్తాయని, ఆండ్రాయిడ్ 10, ఆపై వెర్షన్లు వాడుతున్న వారు బీఎస్ఎన్ఎల్ లైవ్ టీవీ యాప్ ను ఇన్స్టాల్ చేసుకొని వీటిని చూడవచ్చని వెల్లడించింది. తొలుత మధ్యప్రదేశ్(MP), తమిళనాడు(TN) రాష్ట్రాల కస్టమర్లకు మాత్రమే ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని, త్వరలోనే మిగతా రాష్ట్రాల్లో అమలు చేస్తామని తెలిపింది. కాగా జియో(Jio), ఎయిర్‌టెల్(Airtel) లాంటి టెలికాం సంస్థలు మొబైల్ రీఛార్జ్‌ ధరలు పెంచడంతో చాలామంది బీఎస్‌ఎన్‌ఎల్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో కస్టమర్లను అట్ట్రాక్ట్ చేయడానికి బీఎస్‌ఎన్‌ఎల్‌ ఎప్పటికప్పుడు కొత్త సేవలకు శ్రీకారం చుడుతోంది. అలాగే మార్చి 2025 నాటికి దేశవ్యాప్తంగా 4జీ సేవలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది.


👉 Click Here For Tweet!

Advertisement

Next Story