BSNL : బీఎస్ ఎన్ ఎల్ బంపర్ అఫర్ ...రూ. 1,198కే ఏడాది రీచార్జ్

by Y. Venkata Narasimha Reddy |
BSNL : బీఎస్ ఎన్ ఎల్ బంపర్ అఫర్ ...రూ. 1,198కే ఏడాది రీచార్జ్
X

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల పెరిగిన వినియోగదారుల ఆదరణతో జోష్ మీదున్న ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ ఎల్(BSNL) తన మార్కెట్ ను మరింత విస్తరించే ప్రణాళికలకు పదును పెడుతోంది. తాజాగా తన వినియోగదారుల కోసం సరికొత్త రీఛార్జ్ ప్లాన్‌ను ప్రారంభించింది. రూ. 1,198లకే (year recharge) 365 రోజుల ప్లాన్ వాలిడిటీతో ప్రీపెయిడ్ రీచార్జ్ అందిస్తుంది. ఈ ప్లాన్ తో దేశవ్యాప్తంగా ఏ నంబర్‌కు అయినా కాల్ చేయడానికి వినియోగదారులకు ప్రతి నెలా 300 ఉచిత నిమిషాలు అందిస్తుంది. అలాగే ప్రతి నెలా 3GB హై స్పీడ్ 3G/4G డేటాను పొందనున్నారు. ఈ ప్లాన్‌లో వినియోగదారులు ప్రతి నెలా 30 ఉచిత SMSల సౌకర్యాన్ని కూడా పొందవచ్చు. దేశంలోని ప్రైవేట్ టెలికాం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను భారీగా పెంచిన నేపథ్యంలో బీఎస్ఎన్ ఎల్ తీసుకొచ్చిన ఈ నూతన రీచార్జ్ ప్లాన్ చౌకగా వినియోగదారులకు అందుబాటులో ఉంది.

మరో 365 రోజుల రీఛార్జ్ ప్లాన్ ధరను కూడా రూ. 100 తగ్గించింది. కంపెనీ ఈ ప్లాన్ ధరను రూ.100 తగ్గించింది. రూ. 1999 రీచార్జ్ ప్లాన్ ధరను ఇప్పుడు రూ.100 తగ్గింపుతో రూ. 1899కి అందిస్తోంది. ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్ సౌకర్యాన్ని, రోజువారీ పరిమితి లేకుండా మొత్తం 600GB డేటాను వినియోగదారులు పొందనున్నారు. అలాగే ఈ ప్లాన్‌లో వినియోగదారులకు ప్రతిరోజూ 100 ఉచిత SMSలకు అవకాశం కల్పించారు.

Advertisement

Next Story