Jio:జియో యూజర్లకు బిగ్ అలర్ట్

by Jakkula Mamatha |
Jio:జియో యూజర్లకు బిగ్ అలర్ట్
X

దిశ,వెబ్‌డెస్క్:జియో వినియోగదారులకు బిగ్ అలర్ట్‌ను తెలిపింది. ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఈ క్రమంలో జియో యూజర్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ టెక్నాలజీ యుగంలో సైబర్ నేరగాళ్లు ఎటు నుంచి ఎటాక్ చేస్తారో తెలియదనీ సూచించింది. ఇందులో భాగంగా తమ పేరిట సైబర్ నేరగాళ్లు పంపుతున్న మెసేజ్‌లను నమ్మోద్దని యూజర్లకు జియో సూచించింది. కాల్, మెసేజ్, ఈ-మెయిల్ ద్వారా పాన్, ఆధార్, బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ కార్డ్, ఓటీపీలు అడుగుతున్నారని పేర్కొంది. ఎలాంటి లింక్‌లు వచ్చినా క్లిక్ చేయోద్దంది. థర్డ్ పార్టీ యాప్‌లు ఇన్‌స్టాల్ చేసుకోవాలని చెప్పినా పట్టించుకోవద్దని సూచించింది. సిమ్ కార్డ్ వెనుక ఉండే 20 డిజిట్స్ నంబర్ ఎవ్వరితో పంచుకోవద్దని తెలిపింది.

Advertisement

Next Story