BIG ALERT: డిజిటల్ అరెస్ట్ మోసాలు.. కస్టమర్లకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బిగ్ అలర్ట్..!

by Maddikunta Saikiran |   ( Updated:2024-11-03 12:43:14.0  )
BIG ALERT: డిజిటల్ అరెస్ట్ మోసాలు.. కస్టమర్లకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బిగ్ అలర్ట్..!
X

దిశ, వెబ్ డెస్క్: మన దేశంలో గత కొన్ని రోజులుగా డిజిటల్ అరెస్ట్(Digital Arrest) పేరుతో సైబర్ మోసాలు జరుగుతున్న విషయం తెలిసిందే. లా ఎన్‌ఫోర్స్‌మెంట్(Law- Enforcement) అధికారుల పేరుతో వీడియో కాల్ చేసి మీ బ్యాంక్ అకౌంట్లలో మోసపూరిత లావాదేవీలు జరిగాయని, అందుకే మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నట్లు సైబర్ నేరగాళ్లు(Cyber ​​Criminals) పలువురిని మోసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దిగ్గజ ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ(HDFC) కీలక ప్రకటన చేసింది. సైబర్ నేరాలపై తమ ఖాతాదారులను అప్రమత్తం చేస్తూ అలర్ట్ జారీ చేసింది. డిజిటల్ అరెస్టుల మోసాలపై కస్టమర్లు అప్రమత్తంగా ఉండాలని కొన్ని సూచనలు చేసింది. నిజమైన ప్రభుత్వ అధికారులు ఎవరూ కూడా ఫోన్లలో కస్టమర్లకు సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ వివరాలు అడగరని, ఎవరైనా కాల్ చేసి మీ ఆధార్, పాన్ ఈ-కేవైసీ, బ్యాంక్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ లాంటి వివరాలు అడిగినా స్పందించొద్దని తెలిపింది. డెబిట్, క్రెడిట్ కార్డుల నంబర్లు, CVV, పిన్, ఓటీపీ లాంటివి వేరే వాళ్లతో షేర్ చేసుకోవద్దని ఖాతాదారులను సూచించింది. మీకు వచ్చే లింకులు, వెబ్‌సైట్ల పేర్లలో తప్పులుంటాయి. వాటిని గమనిస్తే సైబర్ మోసాలను అడ్డుకోవచ్చని తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed