- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వందే భారత్ రైళ్ల తయారీకి బిడ్‌లు దాఖలు చేసిన హైదరాబాద్ కంపెనీ
న్యూఢిల్లీ: 100 అల్యూమినియం వందే భారత్ రైళ్లను తయారు చేయడానికి ఫ్రాన్స్‌కు చెందిన రైల్వే కంపెనీ ఆల్‌స్టోమ్, హైదరాబాద్‌కు చెందిన మేధా సర్వో డ్రైవ్‌లు బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొన్నాయి. అయితే మేధా సర్వో డ్రైవ్ స్విట్జర్లాండ్‌కు చెందిన స్టాడ్లర్‌తో కలిసి బిడ్‌లను దాఖలు చేసింది. అల్యూమినియం బాడీతో తయారు చేసిన రైళ్లు తేలికగా ఉండటమే కాకుండా, అధిక ఇంధన సామార్థ్యాన్ని ఇస్తాయి. పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం, 100 అల్యూమినియం వందే భారత్ రైళ్ల నిర్మాణానికి దాదాపు రూ. 30,000 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉంది. భారతీయ రైల్వేలు ఉపయోగించే మొదటి అల్యూమినియం రైళ్లు ఇవే కావడం విశేషం. ఈ ప్రాజెక్టు కింద 100 వందే భారత్ రైళ్లను తయారు చేసి 35 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యతలు చూసుకోవాల్సి ఉంటుంది.
చెన్నైకి చెందిన ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) మాజీ జనరల్ మేనేజర్ సుధాన్షు మణి మాట్లాడుతూ, అల్యూమినియం రైళ్లతో భారతదేశంలో ప్రయాణానికి కొత్త శకానికి నాంది పలుకుతున్నాము, ఇండియన్ రైల్వేలు దీనిని మొదటిసారి ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 2023 నాటికి కనీసం 75 వందే భారత్ రైళ్లను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇటీవలి కేంద్ర బడ్జెట్‌లో కూడా అధిక మొత్తంలో నిధులు కేటాయించారు.