- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Airtel: 4జీ, 5జీ విస్తరణ కోసం ఎరిక్సన్‌తో ఒప్పందం కుదుర్చుకున్న ఎయిర్‌టెల్
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద ప్రైవేట్ రంగ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ విస్తరణ కోసం టెలికాం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్‌తో కీలక ఒప్పందం చేసుకుంది. ముఖ్యంగా ఎయిర్‌టెల్ 4జీ, 5జీ నెట్‌వర్క్ విస్తరణకు తాజా ఒప్పందంపై సంతకం చేసినట్టు బుధవారం ప్రకటనలో వెల్లడించింది. కొత్త ఒప్పందం ప్రకారం, ఎరిక్సన్ సెంట్రలైజ్‌డ్ రేడియో తరంగాలు, ఓపెన్ రేడియో తరంగ పరికరాలను అందిస్తుంది. దీనివల్ల వినియోగదారులకు మెరుగైన నెట్‌వర్క్ కవరేజ్ లభిస్తుంది. అలాగే, ఎరిక్సన్ ప్రస్తుతం అందిస్తున్న 4జీ రేడియోల సాఫ్ట్‌వేర్ అప్‌గ్రెడేషన్ చేయనుందని ఎయిర్‌టెల్ తన ఎక్స్ఛేంజి ఫైలింగ్‌లో పేర్కొంది. మొత్తంగా ఎయిర్‌టెల్ కొత్త 4జీ, 5జీ పరికరాల కోసం ఎరిక్సన్‌తో పాటు నోకియా, శాంసంగ్‌లతో సుమారు రూ. 10,000 కోట్లకు పైగా ఒప్పందాలను ఖరారు చేసింది. ఈ ఒప్పందాల ద్వారా రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా కంపెనీలకు మరింత పోటీ ఇచ్చేందుకు ఎయిర్‌టెల్‌కు అవకాశం లభిస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా 4జీ నెట్‌వర్క్ మెరుగుపరచడం, 5జీ విస్తరణ పెంచడం ద్వారా మారుమూల ప్రాంతాల్లోని ఫీచర్ ఫోన్ కస్టమర్లను అప్‌గ్రేడ్ చేసేందుకు వీలవుతుందని ఎయిర్‌టెల్ భావిస్తోంది.