భారత్ పే, ఫోన్‌పే మధ్య ట్రేడ్‌మార్క్ వివాదానికి తెర

by S Gopi |
భారత్ పే, ఫోన్‌పే మధ్య ట్రేడ్‌మార్క్ వివాదానికి తెర
X

దిశ, బిజినెస్ బ్యూరో: కొన్నేళ్ల నుంచి భారత్‌పే, ఫోన్‌పే మధ్య కొనసాగుతున్న వివాదానికి ఇరు కంపెనీలు ముగింపు పలికాయి. 'పే' ట్రేడ్‌మార్క్‌ను ఉపయోగించే అంశంపై దీర్ఘకాలంగా ఉన్న అన్ని చట్టపరమైన వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకున్నట్టు భారత్‌పే గ్రూ, ఫోన్‌పే గ్రూప్‌లు ఆదివారం ప్రకటించాయి. ఇరు కంపెనీల మధ్య ఈ వివాదం ఐదేళ్ల నుంచి కొనసాగుతోంది. ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రీలో కంపెనీలు పరస్పరం వేసిన న్యాయపరమైన కేసులను ఉపసంహరించుకోవాలని నిర్ణయించాయి. ఇది వారి సంబంధిత మార్కుల రిజిస్టర్‌ను కొనసాగించడానికి సహాయపడనుంది. ఈ చర్యను భారత్‌పే బోర్డు ఛైర్మన్ రజనీష్ కుమార్ పరిశ్రమకు ఇది సానుకూల పరిణామమని అభివర్ణించారు. ఇదే సమయంలో ఇరు కంపెనీలు ఈ వ్యవహారంపై చూపిన చొరవకు అభినందించారు. ఈ నిర్ణయం దేశీయంగా బలంగా వృద్ధి చెందుతున్న డిజిటల్ చెల్లింపుల పర్యావరణ వ్యవస్థలను మరింత శక్తివంతం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో ఢిల్లీ, బాంబే హైకోర్టుల్లో ఉన్న అన్ని కేసులను సెటిల్‌మెంట్ ఒప్పందం కింద పరిష్కార చర్యలను తీసుకోనున్నాయి.

Advertisement

Next Story