- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Bajaj Group: హెల్త్‌కేర్ రంగంలోకి అడుగుపెట్టనున్న బజాజ్ గ్రూప్

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ బజాజ్ గ్రూప్ హెల్త్‌కేర్ రంగంలోకి అడుగుపెట్టనున్నట్టు బ్లూమ్‌బర్గ్ నివేదిక తెలిపింది. సరసమైన, అత్యాధునిక సౌకర్యాలతో ఆసుపత్రుల నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేసేందుకు సంస్థ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇందుకోసం దశలావారీగా పెట్టుబడులు పెట్టాలని కంపెనీ భావిస్తోంది. గతేడాది ఆగష్టులోనే బజాజ్ గ్రూప్ హెల్త్‌కేర్ రంగంలోకి ప్రవేశించనున్నట్టు తెలిపింది. తాజా పరిణామాలతో కంపెనీ పెట్టుబడుల ప్రక్రియపై స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతానికి ప్రారంభ పెట్టుబడిగా రూ. 10,000 కోట్లను కేటాయించినట్టు, హెల్త్‌కేర్ విభాగానికి బజాజ్ ఆటో ఛైర్మన్ నీరజ్ బజాజ్ కుమారుడు నీరవ్ బజాజ్ నాయకత్వం వహించనున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 1926లో స్థాపించిన బజాజ్ గ్రూప్ విలువ ప్రస్తుతం రూ. 2.03 లక్షల కోట్లుగా ఉంది. దేశంలోని వివిధ రంగాల్లో వ్యాపారాలను నిర్వహిస్తున్న బజాజ్ గ్రూప్ మొత్తం 40 కంపెనీలను నిర్వహిస్తోంది. బజాజ్ అలయంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ద్వారా ఆరోగ్య బీమా సేవలందిస్తుండగా, బజాజ్ ఫిన్‌సర్వ్ హెల్త్ టెలిమెడిసిన్, ల్యాబ్ టెస్టింగ్, ఆన్‌లైన్ ఫార్మసీ సేవలను అందిస్తోంది. కాగా, ప్రస్తుతం దేశంలో అతిపెద్ద ప్రైవేట్ హెల్త్‌కేర్ కంపెనీగా అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ ఉంది.