Audi: కార్ల ధరలను 3 శాతం పెంచుతున్నట్లు ప్రకటించిన ఆడి

by Maddikunta Saikiran |
Audi: కార్ల ధరలను 3 శాతం పెంచుతున్నట్లు ప్రకటించిన ఆడి
X

దిశ, వెబ్‌‌డెస్క్: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థలు మెర్సిడెజ్ బెంజ్(Mercedes Benz), బీఎండబ్ల్యూ(BMW) ఇటీవలే అన్ని వాహనాల ధరలను 3 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా అదే బాటలో జర్మనీ(Germany)కి చెందిన లగ్జరీ కార్ల దిగ్గజం ఆడి(Audi) కూడా తమ కార్ల ధరలను పెంచనుంది. ఇండియా(India)లో విక్రయిస్తున్న అన్ని రకాల మోడళ్లపై 3 శాతం మేర ధరలను పెంచనున్నట్లు సోమవారం ప్రకటించింది. పెరిగిన ధరలు వచ్చే ఏడాది జనవరి నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. పెరిగిన ఉత్పత్తి వ్యయాలు(Production Costs), రవాణా ఛార్జీలు(Transportation Charges), ద్రవ్యోల్బణ ఒత్తిడుల(Inflationary Pressures) నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ప్రస్తుతం ఆడి మన దేశంలో A4, A6, Q3, Q5, Q7 వంటి ప్రముఖ మోడళ్లను సేల్ చేస్తోంది. కాగా ఆడి ఈ సంవత్సరం జూన్ లోనూ కంపెనీ కార్ల ధరలను 2శాతం పెంచిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed