- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిర్మాణం, మైనింగ్ రంగాల కోసం అశోక్ లేలాండ్ కొత్త టిప్పర్!
చెన్నై: ప్రముఖ హిందూజా గ్రూపునకు చెందిన అశోక్ లేలాండ్ సంస్థ నిర్మాణ, మైనింగ్ రంగాల్లో అవసరాల కోసం ఏవీటీఆర్ 4825 పేరుతో కొత్త టిప్పర్ వాహనాన్ని శుక్రవారం తీసుకొచ్చింది. వినియోగదారుల అవసరాలను బట్టి కేబిన్, బాడీ ఆప్షన్లలో దీన్ని అందిస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. హెచ్6 ఇంజిన్‌తో అందుబాటులో ఉన్న ఈ వాహనం 19-55 టన్నుల గ్రాస్ వెహికల్ ఆఫ్ వెయిట్ విభాగంలో అందుబాటులోకి తెచ్చినట్టు వెల్లడించింది.
ఈ టిప్పర్ అధిక సామర్థ్యం కలిగి ఉందని, అత్యంత శక్తివంతమైన హెచ్6 4వీ ఇంజిన్, హెవీ డ్యూటీ డ్రైవింగ్‌తో పాటు నిర్మాణ, మైనింగ్ రంగాల కార్యకలాపాలకు అనుగుణంగా ఎత్తైన ప్రదేశాలు, కొండ ప్రాంతాల్లో ఎక్కువ లోడ్‌ను మోయగలదని అశోక్ లేలాండ్ మీడియం, భారీ కమర్షియల్ వాహనాల విభాగం హెడ్ సంజీవ్ కుమార్ అన్నారు. 250 హెచ్‌పీ సామర్థ్యంతో పనిచేసే ఈ వాహనం ఐ-జెన్6 టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తూ ఇంజిన్ పనితీరును మెరుగుపరుస్తుందని ఆయన తెలిపారు.