- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రపంచ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
న్యూఢిల్లీ: భారత్, బ్రిటన్‌ను అధిగమించి 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినందుకు మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు. ట్విట్టర్ వేదికగా ఆయన "స్వాతంత్రం కోసం ఎంతో కష్టపడి పోరాడి త్యాగం చేసిన ప్రతి భారతీయుడి గుండెల్లో ఈ వార్త నిండి ఉంటుందని, భారతదేశం ఆర్థిక ఇబ్బందుల్లో పడుతుందని భావించిన వారికి ఇది బలమైన సమాధానం అని" అన్నారు.
ఇంతకు ముందు భారత్ బ్రిటన్ కంటే వెనుకబడి ఉంది. కానీ గణనీయమైన ఆర్థిక వృద్ధితో బ్రిటన్‌ను దాటి ప్రపంచ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించి అమెరికా, చైనా, జపాన్, జర్మనీల తర్వాత స్థానాన్ని ఆక్రమించింది. దశాబ్దం క్రితం, భారతదేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో 11వ స్థానంలో ఉండగా, UK 5వ స్థానంలో ఉంది.
భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 7 శాతానికి పైగా వృద్ధి చెందుతుందని అంచనా. ఈ త్రైమాసికంలో స్టాక్ మార్కెట్లు కూడా బాగా పుంజుకున్నాయి. బ్రిటన్ GDP రెండవ త్రైమాసికంలో నగదు పరంగా కేవలం 1 శాతం పెరిగింది. ద్రవ్యోల్బణానికి సర్దుబాటు చేసిన తర్వాత, 0.1 శాతం తగ్గింది. ఈ సంవత్సరం భారత కరెన్సీ తో పోలిస్తే పౌండ్ 8 శాతం పడిపోయింది.
Also Read : 5 కోట్ల కంటే ఎక్కువ పన్ను ఎగవేతల్లో జీఎస్టీ అధికారులే విచారణ మొదలుపెట్టొచ్చు: ఆర్థిక శాఖ!
Also Read : ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచిన 'సిటీ యూనియన్ బ్యాంక్'