పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల్లో అంబుజా సిమెంట్స్ భారీ పెట్టుబడులు

by srinivas |
పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల్లో అంబుజా సిమెంట్స్ భారీ పెట్టుబడులు
X

ముంబై: అదానీ గ్రూపునకు చెందిన అంబుజా సిమెంట్స్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల్లో భారీగా పెట్టుబడులు పెట్టనుంది. 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి 1,000 మెగావాట్ల సామర్థ్యం కోసం ఏకంగా రూ. 6,000 కోట్ల పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పెట్టుబడుల ద్వారా గుజరాత్‌లో 600 మెగావాట్ల సోలార్ ఇంధనం, 150 మెగావాట్ల విండ్ ఎనర్జీ, రాజస్థాన్‌లో 250 మెగావాట్ల సోలార్ ఇంధన ప్రాజెక్టులు ఉంటాయని కంపెనీ వెల్లడించింది. క్రమంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించి, ఏడాదికి 140 మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించాలనే లక్ష్యంతో ఉన్నట్టు కంపెనీ తెలిపింది. ఇదే సమయంలో మొత్తం ఇంధన అవసరాల్లో 60 శాతం గ్రీన్ ఎనర్జీ రూపంలో సమకూర్చుకోవాలని, అందుకే ఈ పెట్టుబడులకు కంపెనీ సిద్ధమైంది. రాబోయే 10 ఏళ్లలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో 100 బిలియన్ డాలర్లు(రూ. 8 లక్షల కోట్లకు పైగా) పెట్టుబడులను గౌతమ్ అదానీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed