- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అమెజాన్ ప్రైమ్‌లో యాడ్స్
దిశ, బిజినెస్ బ్యూరో: టీవీ చూస్తున్నప్పుడో, వీడియోలు చూస్తున్న సమయంలోనో మధ్యలో యాడ్స్ రావడం విసుగు తెప్పిస్తుంది. దీనివల్ల చూస్తున్న కార్యక్రమం లేదా సినిమా అనుభూతి దెబ్బతింటుంది. ఈ కారణంతోనే ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సేవలందించే సంస్థలు సబ్‌స్క్రైబర్లకు యాడ్స్-ఫ్రీ సేవలు అందిస్తుంటాయి. అయితే, ఇప్పటివరకు యాడ్స్ లేకుండా సబ్‌స్క్రైబర్లకు స్ట్రీమింగ్ సేవలందించిన అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇకపై యాడ్స్ కూడా చూడాల్సి రావొచ్చు. ఎందుకంటే జనవరి 29 నుంచి కొన్ని సినిమాలు, టీవీ షోలలో యాడ్స్‌ని వేయనున్నట్టు ప్రైమ్ ప్రకటించింది. ఈ నిర్ణయం గతేడాదిలోనే తీసుకున్నప్పటికీ, అమలును పొడిగిస్తూ వచ్చింది. 2016లో కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి అమెజాన్ సంస్థ ఎలాంటి యాడ్స్ వేయలేదు. అయితే సబ్‌స్క్రైబర్లకు మరింత మెరుగైన కంటెంట్ అందించేందుకు ఇప్పుడు ప్రైమ్ వీడియోలో వచ్చే కొన్ని సినిమాలు, షోలలో యాడ్స్ వేయాలని నిర్ణయించింది. కానీ, టీవీ ఛానల్స్‌లో వచ్చే విధంగా కాకుండా ఇవి తక్కువ నిడివితో, సబ్‌స్క్రైబర్లకు ఇబ్బందుల్లేని విధంగా ఉంటాయని కంపెనీ చెబుతోంది.
ఈ యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని మరింత నాణ్యమైన కంటెంట్ కోసం వినియోగించనున్నట్టు అమెజాన్ వివరించింది. ఇదే సమయంలో ఈ నిర్ణయం అమలు తర్వాత కూడా యాడ్స్ లేని కంటెంట్ కోరుకునే వారి కోసం ప్రత్యేక సదుపాయం ఉందని కంపెనీ తెలిపింది. అందుకోసం అదనంగా కొంత చెల్లించాలని పేర్కొంది. ప్రస్తుతానికి ఈ యాడ్స్ యూఎస్, జర్మనీ, కెనడా, యూకే లాంటి కొన్ని దేశాల్లో ప్రారంభిస్తామని వెల్లడించింది. మిగిలిన దేశాలకు దీన్ని విస్తరించడంపై స్పష్టత ఇవ్వలేదు.