ఏడాది కాలంలో ఐదు కోట్లకు పెరిగిన ఎయిర్‌టెల్ 5జీ కస్టమర్లు!

by Vinod kumar |
ఏడాది కాలంలో ఐదు కోట్లకు పెరిగిన ఎయిర్‌టెల్ 5జీ కస్టమర్లు!
X

న్యూఢిల్లీ: దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ ఇప్పటివరకు 5 కోట్ల 5జీ సబ్‌స్క్రైబర్లను పొందినట్టు ఓ ప్రకటనలో తెలిపింది. గతేడాది అక్టోబర్ 1న దేశవ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్ సేవలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. తాజాగా కంపెనీ వార్షికోత్సవం సందర్భంగా దాదాపు అన్ని జిల్లాల్లో ఎయిర్‌టెల్ 5జీ ప్లస్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని ప్రకటించింది. మొత్తం 28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాల్లో 5జీ సేవలు అందిస్తున్నాం. ఈ మైలురాయి అనుకున్న సమయం కంటే ముందే చేరుకున్నాం.

ఇది అయిర్‌టెల్ 5జీ సేవల విస్తరణ వేగాన్ని సూచిస్తుంది. 2022, అక్టోబర్‌లో 10 లక్షల నుంచి గడిచిన 12 నెలల కాలంలో 5 కోట్లకు చేరగడం గర్వంగా ఉంది. భవిష్యత్తులో మరింత మెరుగైన 5జీ సేవలను అందించే లక్ష్యంతో పనిచేయనున్నట్టు ఎయిర్‌టెల్ ఛీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ రణదీప్ సెఖొన్ అన్నారు. గణాంకాల ప్రకారం, దేశంలో మొత్తం 10 కోట్లకు పైగా 5జీ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఆగష్టు చివరి వారంలో జరిగిన కంపెనీ ఏజీఎంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ జియో 5జీ వినియోగదారుల సంఖ్య 5 కోట్లకు చేరుకుందని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed