Air India: ఇజ్రాయెల్‌కు వెళ్లే అన్ని ఎయిర్ఇండియా విమానాల సేవలు బంద్

by S Gopi |
Air India: ఇజ్రాయెల్‌కు వెళ్లే అన్ని ఎయిర్ఇండియా విమానాల సేవలు బంద్
X

దిశ, బిజినెస్ బ్యూరో: మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య యుద్ధం, వీటి మధ్య ఇరాన్ జోక్యం చేసుకోవడం వంటి పరిణామాలు వేగంగా పుంజుకుంటున్నాయి. దానివల్ల పశ్చిమాసియాలోని కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. తక్షణం అమల్లోకి వచ్చేలా ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌కు వెళ్లే అన్ని షెడ్యూల్డ్ విమానాలను నిలిపేస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. ప్రయాణీకులు, సిబ్బంది భద్రత తమకు మొదటి ప్రాధాన్యతని సంస్థ స్పష్టం చేసింది. టెల్ అవీన్‌కు వెళ్లే, అక్కడి నుంచి బయలుదేరే అన్ని విమాన సేవలను నిలిపేస్తున్నాం. ఇప్పటికే టికెట్లను బుకింగ్ చేసుకున్న ప్రయాణీకులకు పూర్తి రీఫండ్ ఉంటుందని పేర్కొంది. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి విమానాల సర్వీసుల పునరుద్ధరణంపై నిర్ణయం తీసుకుంటామని ఎయిర్ఇండియా అధికారిక ప్రకటనలో వెల్లడించింది.

Advertisement

Next Story