అంబుజా సిమెంట్స్‌లో మరో రూ. 8,339 కోట్లు పెట్టుబడి పెట్టిన అదానీ

by S Gopi |
అంబుజా సిమెంట్స్‌లో మరో రూ. 8,339 కోట్లు పెట్టుబడి పెట్టిన అదానీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: బిలీయనీర్ గౌతమ్ అదానీ కుటుంబం సిమెంట్ కంపెనీ అంబుజా సిమెంట్స్‌లో అదనంగా రూ. 8,339 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. తద్వారా కంపెనీలో తమ వాటాను 70.3 శాతానికి పెంచి, కంపెనీ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచనున్నట్టు సమాచారం. 2022, అక్టోబర్‌లో అదానీ రూ. 5,000 కోట్లు, ఈ ఏడాది మార్చిలో రూ. 6,661 కోట్ల పెట్టుబడులు పెట్టింది. తాజా పెట్టుబడితో అంబుజా సిమెంట్స్‌లో అదానీ రూ. 20,000 కోట్ల ప్రణాళికబద్ధమైన పెట్టుబడులను పూర్తి చేసినట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. గతేడాది డిసెంబర్ 31 నాటికి 7.61 కోట్ల టన్నుల నుంచి 2028 నాటికి అంబుజా సిమెంట్స్ సామర్థ్యాన్ని ఏటా 14 కోట్ల టన్నులతో దాదాపు రెట్టింపు చేయాలని అదానీ పెట్టుబడులు దోహదపడనున్నాయి. భవిష్యత్తులో సిమెంట్ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అదానీ కుటుంబం పెట్టుబడులు ఉపయోగించనున్నారు. తాజా పెట్టుబడులను సామర్థ్య విస్తరణ, నిర్వహణ పనితీరు మెరుగుపరిచేందుకు, వనరులు, సరఫరా కోసం వినియోగించనున్నట్టు అంబుజా సిమెంట్ పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed