- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీడియా రంగంలో అదానీ దూకుడు
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ బిలీయనీర్ గౌతమ్ అదానీ మీడియా వ్యాపారాన్ని విస్తరించే ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. తాజాగా న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్‌లో మెజారిటీ వాటాను మరింత పెంచి సంస్థలో పూర్తిస్థాయి నియంత్రణను దక్కించుకున్నట్టు అదానీ గ్రూప్ మీడియా విభాగం వెల్లడించింది. ఈ మేరకు బుధవారం ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. అదానీ గ్రూపునకు చెందిన ఏఎంజీ మీడియా నెట్‌వర్క్స్ ఇటీవల ఐఏఎన్ఎస్‌లో 50.50 శాతం వాటాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దీన్ని ఇప్పుడు ఓటింగ్ హక్కులతో 76శాతం, ఓటింగ్ హక్కులు లేకుండా 99.26 శాతానికి పెంచుకున్నారు. దీనికోసం కంపెనీ రూ. 5 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టినట్టు స్పష్టం చేసింది. ఈ నెల 16న జరిగిన న్యూస్ ఏజెన్సీ బోర్డు సమావేశంలో వాటాను పెంచుకునేందుకు ఆమోదం లభించిందని పేర్కొంది. ఐఏఎన్ఎస్ ఇకమీదట ఏఎంజీ మీడియా నెట్‌వర్క్స్ అనుబంధ సంస్థగా ఉండనుందని అదానీ గ్రూప్ తెలిపింది. 2023లో బిజినెస్, ఫైనాన్స్ న్యూస్ సంస్థ క్వింటిలియన్ బిజినెస్ మీడియాను కొనుగోలు చేయడం ద్వారా మీడియా వ్యాపారంలోకి అడుగుపెట్టిన అదానీ గ్రూప్ డిసెంబర్‌లో ఎన్‌డీటీవీలో 65 శాతం వాటాను దక్కించుకుని ఈ రంగంలో దూకుడు పెంచారు.