- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంబుజా సిమెంట్‌లో అదానీ కుటుంబం రూ. 6,661 కోట్లు పెట్టుబడులు
దిశ, బిజినెస్ బ్యూరో: బిలీయనీర్ గౌతమ్ అదానీ కుటుంబం కొత్తగా రూ. 6,661 కోట్ల పెట్టుబడి ద్వారా అంబుజా సిమెంట్‌లో తమ వాటాను 66.7 శాతానికి పెంచుకుంది. ఇదివరకు 2022, అక్టోబర్‌లో బోర్డు ఆమోదించిన వారెంట్ల జారీ ద్వారా ప్రమోటర్ గ్రూప్ రూ. 5,000 కోట్ల నిధులు అంబుజా సిమెంట్‌లో ఉంచిన సంగతి తెలిసిందే. తాజాగా కంపెనీలో అదానీ కుటుంబం మరో 3.6 శాతం పెంచుకున్నట్టు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. దీంతో ఇప్పటివరకు అదానీ కుటుంబం అంబుజా సిమెంట్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి మొత్తంగా రూ. 11,661 కోట్ల పెట్టుబడులు పెట్టింది. తాజా పెట్టుబడుల ద్వారా వేగవంతమైన వృద్ధి, మూలధన నిర్వహణ, మెరుగైన బ్యాలెన్స్ షీట్ కోసం ఉపయోగపడతాయని కంపెనీ భావిస్తోంది. అంతేకాకుండా దీర్ఘాకాలం తమ వాటాదారులకు స్థిరమైన విలువను అందించడం కోసం ఈ నిధులు దోహదపడతాయని అంబుజా సిమెంట్ హోల్‌టైమ్ డైరెక్టర్, సీఈఓ అజయ్ కపూర్ అన్నారు. గురువారం మధ్యాహ్నం సమయానికి అంబుజా సిమెంట్స్ షేర్ ధర 2.24 శాతం పెరిగి రూ. 614.95 వద్ద ఉంది. కంపెనీ మార్కెట్ విలువ రూ. 1.21 లక్షల కోట్లకు పెరిగింది.