- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చెన్నైలో వ్యాపారి కుటుంబంపై కాల్పులు..
దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడు రాజధాని ప్రాంతమైన చెన్నైలో దారుణం చోటుచేసుకుంది. పారిస్ కార్నర్‌లోని షావుకారుపేటలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని గుర్తుతెలియని దుండగులు విచక్షణా రహితంగా కాల్చిచంపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపగా, చుట్టుపక్కల వారు భయాందోళనకు గురయ్యారు.
వివరాల్లోకివెళితే.. షావుకారుపేటలో దలీల్ చంద్ అనే ఫైనాన్స్ వ్యాపారి కుటుంబం నివాసముంటోంది. అయితే, బుధవారం ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని దుండగులు వ్యాపారి కుటుంబాన్ని తుపాకితో కాల్చిచంపారు. కాల్పుల్లో వ్యాపారి దలీల్ చంద్ (74), ఆయన భార్య కుషాల్ భాయ్ (70), కుమారుడు సీతర్ (38) అక్కడికక్కడే మృతి చెందారు. అయితే, ఈ దాడికి ఆర్థిక లావాదేవీలే కారణంగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.