- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తీరానికి 40 కి.మీ దూరంలో బురేవి తుఫాన్!
దిశ, వెబ్‌డెస్క్ : బురేవి తుఫాన్ బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురానికి 40 కి.మీ దూరంలో బురేవీ తుఫాన్ నిశ్చలంగా ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరో 12గంటల పాటు సముద్రంలో తుఫాన్ స్థిరంగా ఉంటుందని అధికారులు తెలిపారు. బురేవి ప్రభావంతో కడలూరు, అరియలూరు, నాగపట్నం, రామనాథపురం జిల్లాలో కుండపోత వర్షం కురుస్తోంది. అయితే, తుఫాన్ దిశ మార్చుకుని పుదుచ్చేరి, చెన్నై వైపుగా కదిలే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది.
ఒక వేళ తుఫాన్ దిశ మార్చుకుంటే దాని ప్రభావం ఏపీపై కూడా ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం తమిళనాడులోని నాలుగు జిల్లాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. దీంతో శనివారం, ఆదివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇదిలాఉండగా, తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 12 మంది మృతిచెందినట్లు సమాచారం. చిదంబరం నటరాజస్వామి ఆలయం జలదిగ్భంధంలో చిక్కుకున్నట్లు అధికారులు వెల్లడించారు.