కోహ్లీ కెప్టెన్సీ కోల్పోవడం మంచిదే.. మరోసారి హాట్ టాపిక్‌గా గౌతం గంభీర్

by Anukaran |   ( Updated:2021-12-12 22:39:17.0  )
కోహ్లీ కెప్టెన్సీ కోల్పోవడం మంచిదే.. మరోసారి హాట్ టాపిక్‌గా గౌతం గంభీర్
X

దిశ, వెబ్‌డెస్క్ : భారత వన్డే, టీ20 జట్టుకు హిట్ మ్యాన్ రోహిత్ శర్మను కెప్టెన్‌ను చేస్తూ బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ నిర్ణయంపై పలువురు సీనియర్ క్రికెటర్లు కీలక కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించడంపై టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ స్పందించాడు.

గంభీర్ మాట్లాడుతూ.. బీసీసీఐ నిర్ణయంతో కోహ్లీ ప్రత్యర్థి జట్టుకు మరింత ప్రమాదకరంగా మారే అవకాశముందని తెలిపాడు. కెప్టెన్సీ పోయినంత మాత్రాన విరాట్ ఆటతీరులో ఎలాంటి మార్పు ఉండదని పేర్కొన్నాడు. ఇప్పుడు కోహ్లీపై వన్డే, టీ20 కెప్టెన్సీ భారం ఉండదు. ఈ నేపథ్యంలో విరాట్ మరింత నైపుణ్యంతో ఆడే అవకాశముందని చెప్పుకొచ్చాడు.

ఇకపై కింగ్ కోహ్లీ అన్ని ఫార్మాట్లలో దూకుడైన ప్రదర్శన చేస్తాడని ఆశిస్తున్నట్టు చెప్పాడు. కోహ్లీలో మరోసారి గొప్ప ఆటగాడిని చూస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే, సుదీర్ఘ ఫార్మాట్‌లో ఇన్ని రోజులు రోహిత్ శర్మపై కెప్టెన్సీ భారం లేదని తెలిపాడు.

Advertisement

Next Story

Most Viewed