- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మహిళల కోణంలో బడ్జెట్ ఉండాలి
by Shyam |
X
దిశ, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోణంలోనూ బడ్జెట్ రూపొందించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య (ఐద్వా) జాతీయ నాయకురాలు టి.జ్యోతి డిమాండ్ చేశారు. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మహిళా వికలాంగులు – స్థితిగతులు అనే అంశంపై రాష్ట్ర సదస్సు జరిగింది. ఐద్వా నాయకురాలు జ్యోతి మాట్లాడుతూ బడ్జెట్‌లో వికలాంగులకు ప్రత్యేక నిధులు కేటాయించాలని అన్నారు. మహిళా వికలాంగులను సంరక్షించే వారికి ప్రభుత్వం అలవెన్సులు ఇవ్వాలన్నారు. వికలాంగులకు అనుగుణంగా పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలన్నారు. రైళ్లలో అదనపు బోగీలు ఉండాలన్నారు. మహిళా వికలాంగులపై వేధింపుల నివారణకు ప్రభుత్వం కృషి చేయాలన్నారు.
Tags: women, budget, aidwa, ts news
Advertisement
Next Story