- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అద్దె అడిగిన యజమాని.. కొట్టి చంపిన వ్యక్తి
దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంటి అద్దె అడిగాడని యజమానిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు అద్దెకుండే వ్యక్తి. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే పాలకొల్లులోని ముచ్చర్ల వారి వీధిలోని వంగా ప్రసాద్ అనే వ్యక్తి ఇంట్లో చిన కొండయ్య కుటుంబం ఏడాది కాలంగా అద్దెకు ఉంటున్నారు. గత 10 నెలలు సక్రమంగా అద్దె చెల్లించిన చినకొండయ్య రెండు నెలలుగా అద్దె చెల్లించటం లేదు. అయితే మార్చి నెల కూడా రావడంతో యజమాని ప్రసాద్ సోమవారం రాత్రి చిన కొండయ్యను అద్దె చెల్లించమని అడిగాడు.
అద్దె చెల్లించకపోతే ఇల్లు ఖాళీ చేయాలని సూచించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. అది కాస్త గొడవకు దారి తీసింది. దీంతో కోపోద్రిక్తుడైన చిన కొండయ్య పక్కనే ఉన్న రాయి తీసుకుని ప్రసాద్ తలపై కొట్టాడు. రాయి గట్టిగా తగలడంతో యజమాని ప్రసాద్ అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయాడు. ప్రసాద్ చనిపోయాడని గ్రహించిన నిందితుడు చినకొండయ్య నేరుగా పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. జరిగిన విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. నిందితుడు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్ధలానికి వచ్చి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.