- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జీ7 సదస్సుకు రండి.. ప్రధాని మోడీకి బ్రిటన్ పీఎం ఆహ్వానం
న్యూఢిల్లీ: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జీ7 సదస్సుకు హాజరవ్వాలని బ్రిటన్ పీఎం బోరిస్ జాన్సన్ ఆహ్వానం పలికారు. ఈ ఏడాది జీ7 సదస్సుకు యూకే అధ్యక్షత వహిస్తున్నది. కరోనానంతర పరిణామాలు, ఆర్థిక సవాళ్లను ఏకమై ఎదుర్కోవడానికి ఈ సదస్సును వినియోగించుకోవాలని యూకే పేర్కొంది. ఏడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, యూఎస్‌ల సదస్సును జీ7 మీట్‌గా పేర్కొంటారు. జూన్ 13 నుంచి 15 మధ్య జరిగే ఈ సదస్సుకు భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, దక్షిణ కొరియాలను అతిథులుగా యూకే ఆహ్వానిస్తున్నది. రెండేళ్ల తర్వాత మళ్లీ భౌతికంగా అందరూ హాజరవ్వనున్నారని, కార్న్‌వాల్‌లో ఈ సదస్సు జరగబోతున్నదని ఓ ప్రకటనలో వివరించింది. ఈ సదస్సుకు ముందే యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ భారత్ పర్యటించే అవకాశమున్నదని తెలిపింది. ఈ ఏడాది భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు జాన్సన్ ముఖ్య అతిథిగా రావలసి ఉన్నది. కానీ, యూకేలో కొత్త స్ట్రెయిన్ కలకలం రేగడం, లాక్‌డౌన్ విధించడం లాంటి కారణాలతో తన పర్యటనను రద్దు చేసుకుంటున్నట్టు బోరిస్ జాన్సన్ తెలిపారు.