తీవ్ర విషాదం మిగిల్చిన అతివేగం.. కొడుకులిద్దరు ఒకే విధంగా అలా మరణించడంతో..

by Web Desk |
తీవ్ర విషాదం మిగిల్చిన అతివేగం.. కొడుకులిద్దరు ఒకే విధంగా అలా మరణించడంతో..
X

దిశ, నిడమనూరు: డివైడర్‌ను ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన నిడమనూరు మండలం ముకుందాపురం గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. శ్యామల గోపాల్(19) అనే యువకుడు గ్రామంలోని వాటర్ ఆటో నడుపుతూ.. కుటుంబానికి అండగా ఉండేవాడు. అయితే గోపాల్ శనివారం పని నిమిత్తం బైక్‌పై వేగంగా వెళుతుండగా.. బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలయ్యాయి. అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుని సోదరుడు కూడా గతంలో యాక్సిడెంట్‌లోనే మరణించాడు. ఇద్దరు కుమారులు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ శోభన్ బాబు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Next Story