తెలుగు రాష్ట్రాల్లో.. ఎండ వాన అలర్ట్

by Seetharam |   ( Updated:2023-05-29 03:08:58.0  )
తెలుగు రాష్ట్రాల్లో.. ఎండ వాన అలర్ట్
X

దిశ,వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో వాతావారణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఆకాశం మేఘావృతమైంది. తెలంగాణలో పలు చోట్ల చిరుజల్లులు పడే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఆకాశం మేఘాలతో నిండుకుంది. అయితే హైదరాబాద్‌లో 38 నుంచి 41 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు చేసుకునే అవకాశం ఉంది. పగటిపూట ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పు ఉండదని వాతావరణ శాఖ సూచించింది. పగటి ఉష్ణో్గ్రతలు మాత్రం 40 నుంచి 43 డిగ్రీల మధ్య ఉండనున్నాయి.

ఏపీలో మాత్రం వాతావరణ పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. ఓవైపు ఎండలు దంచికొడుతుంటే మరోవైపు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. భారీ ఈధురు గాలులకు చెట్లు నేలకొరిగాయి. పలు చోట్ల కరెంటు స్థంభాలు సైతం విరిగి కింద పడ్డాయి. పలు ప్రాంతాల్లో కరెంట్ పోవడంతో పట్టణ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. కరెంట్ లైన్లు పునరుద్ధరణ జరగక పోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. కరెంట్ లేక పోవడంతో పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రి సేవలకు ఆటంకం కలుగుతోంది. ఆసుపత్రిలోని రోగులకు చీకటిలో కష్టాలు తప్పడం లేదు.

Read more:

2023 IPL final: ఇవాళ కూడా వర్షం పడితే విన్నర్‌ను డిసైడ్‌ చేసేది ఇలాగే!

Advertisement

Next Story