- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ నిబంధనలు కేవలం సామాన్యులకేనా.. టీఆర్ఎస్ పార్టీకి వర్తించవా..?
దిశ, మల్యాల: జగిత్యాల జిల్లా తెరాస పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత మొదటిసారి జిల్లాకు వచ్చిన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావుకు తెరాస శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. అయితే ఈ కార్యక్రమంలో మల్యాల క్రాస్ రోడ్డు కూడలి వద్ద, జగిత్యాల పద్మనాయక కల్యాణమండపం, బస్టాండ్ కూడలి వద్ద కొద్దీసేపు ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. స్వాగతోత్సవ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన డీజేలు ర్యాలీలకు పోలీస్ శాఖ పర్మిషన్ ఏవిధంగా ఇచ్చారని బీజేపీ నాయకుడు మల్యాల మండల ఉప సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు నులుగొండ సురేష్ ధ్వజమెత్తారు.
కరోనా ఆంక్షలు ఈ నెల చివరి వరకు పొడిగించినప్పటికీ తెరాస నాయకులు నిబంధనలు తుంగలో తొక్కారని అన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలిగేలా డీజేలు పెట్టి ర్యాలీలు తీయడం ఏంటని ప్రశ్నించారు. నిబంధనలు కేవలం సామాన్యులకే మాత్రమే తెరాస నాయకులకు వర్తించవా అని ఏద్దేవా చేసారు.