- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేంద్ర ప్రభుత్వానికి ఆయన భయం పట్టుకుంది.. ఎమ్మెల్యే సైదిరెడ్డి
దిశ, హుజూర్‌నగర్: సీఎం కేసీఆర్‌ను చూసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భయపడుతుందని.. రాజ్యాంగాన్ని వక్రీకరిస్తూ రాజకీయం చేస్తుందని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఎద్దేవా చేశారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగం పట్ల కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి బీజేపీ అనవసర రాద్దాంతం చేస్తుందని విమర్శించారు. దళితుల పట్ల కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా కేంద్రం దళితులకు రూ.12 వేల కోట్లు ఇస్తే.. తెలంగాణ ప్రభుత్వం రూ.33 వేల కోట్లు కేటాయిస్తుందని తెలిపారు. దళిత బంధు లాంటి అద్భుత పథకాలతో దళితుల అభ్యున్నతికి కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. అదేవిధంగా హుజూర్ నగర్ ప్రజల చిరకాల స్వప్నం మినీట్యాంక్ బండ్‌కు శంఖుస్థాపన జరగనుందని పేర్కొన్నారు. శనివారం హుజూర్ నగర్ నియోజకవర్గంలో జరగనున్న విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేంలో ఎమ్మెల్యే వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకటరెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ గెల్లి అర్చన రవి, జెడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షులు చిట్యాల అమర్ నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.