రూ.14 పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధర

by Hajipasha |   ( Updated:2024-02-01 16:17:55.0  )
రూ.14 పెరిగిన ఎల్పీజీ  సిలిండర్ ధర
X

దిశ, నేషనల్ బ్యూరో : ఓ వైపు పార్లమెంటులో మధ్యంతర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికమంత్రి ప్రవేశపెడుతుండగా.. మరోవైపు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.14 మేర పెరిగింది. అయితే ఈ పెంపు 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌లకు మాత్రమే వర్తిస్తుంది. ఫిబ్రవరి 1 నుంచే ఈ మారిన ధర అమల్లోకి వచ్చింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ రిటైల్ అమ్మకపు ధర రూ.1,769.50కు చేరింది. వాణిజ్య గ్యాస్ సిలిండర్లను వినియోగించే వ్యాపార వర్గాలపై ధర పెరుగుదల ఎఫెక్టు పడనుంది.

Advertisement

Next Story

Most Viewed