- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యూపీ బీజేపీ గెలుపులో తెలుగోడి సత్తా.. 135 స్థానాల్లో కీలకం
దిశ, డైనమిక్ బ్యూరో : దేశ రాజకీయాలను శాసించాలంటే ఉత్తర ప్రదేశ్‌లో గెలుపొందాల్సిందే. మొత్తం 404 అసెంబ్లీ స్థానాలు, 80 లోక్‌సభ ఎంపీలు కలిగిన యూపీలో మరోసారి గెలుపొందేందుకు బీజేపీ తీవ్రంగా శ్రమించింది. లింఖింపూర్ ఘటనపై దేశవ్యాప్త చర్చ జరిపి బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలు తీవ్రంగా పోరాడాయి. కానీ, ఎన్ని ఆరోపణలు వచ్చినా.. ఉత్తరప్రదేశ్ లో రెండో సారి యోగి ఆధిత్యనాథ్ ప్రభుత్వాన్ని నెలకొల్పనున్నారు. అయితే, యోగీ గెలుపులో తెలుగు వ్యక్తి కీలకంగా వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సత్యకుమార్ బీజేపీ పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగి జాతీయ రాజకీయాల్లో కీలక నేతగా మారారు. ప్రస్తుతం యూపీ బీజేపీ కోఇంచార్జిగా ఉన్న సత్యకుమార్‌ను ఎన్నికల నేపథ్యంలో కీలక బాధ్యతలు అప్పజెప్పింది. యూపీలో మొత్తం 403 స్థానాల్లో బీజేపీ పోటీ చేయగా అందులో 135 స్థానాలకు బాధ్యత వహించారు. ఈక్రమంలో 135 సిగ్మెంట్లలో అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహం, బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. ఇలా ఓ తెలుగు వ్యక్తి అతిపెద్ద రాష్ట్రమైన యూపీ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించడం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారారు.