ఏపీలో 13 గ్రామ పంచాయతీ ఎన్నికలకు బ్రేక్

by srinivas |   ( Updated:2021-01-28 22:46:06.0  )
ఏపీలో 13 గ్రామ పంచాయతీ ఎన్నికలకు బ్రేక్
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని 13 గ్రామ పంచాయతీ ఎన్నికలకు బ్రేక్ పడింది. ఇవాళ నుంచి రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు మొదటి దశ నామినేషన్లను స్వీకరించనున్నారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. సర్పంచి, వార్డు సభ్యుల స్థానాలకు ఇవాళ నుంచి జనవరి 31 సాయంత్రం 5 గంటల్లోగా నామినేషన్లు వేయాల్సి ఉంది. పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ఫిబ్రవరి 4న అధికారులు ప్రకటిస్తారు. అప్పటి నుంచి 3 రోజులపాటు ఫిబ్రవవరి 7 సాయంత్రం వరకు ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చు.. 9న ఎన్నికలు నిర్వహించనున్నారు.
కాగా ఈ నేపథ్యంలో కడప జిల్లాలోని 13గ్రామ పంచాయతీ ఎన్నికలకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. పంచాయతీల విలీనం, విభజనపై కోర్టును ఆశ్రయించారు స్థానికులు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్ట్ స్టే విధించింది. దీంతో కడపజిల్లాకు చెందిన 13 గ్రామాల్లో ఎన్నికలకు బ్రేకులు పడ్డాయి.

Advertisement

Next Story