- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాఖీ పండగ జరుపుకున్న ‘ది బ్రేవ్ బ్రదర్’
చెల్లిని కుక్క కరవబోతుండగా అడ్డుగా వెళ్లి, దాని దాడికి గురైన చిన్నారి బ్రిడ్జర్ స్టోరీని గతంలో దిశ పత్రికలో చూశాం కదా! అందులో రాఖీ పండగకు ముందే చెల్లి మీద ప్రేమను చూపించిన అన్న గురించి చెప్పుకోవాల్సి వస్తోందని కూడా ప్రస్తావించుకున్నాం. ఆరేళ్ల బ్రిడ్జర్ చేసిన పని గురించి అతని ఆంటీ నిక్కీ వాకర్ పోస్ట్ చేసిన ఫొటోలు తీవ్రంగా వైరల్ అయ్యాయి. మెక్సికో, బ్రెజిల్, ఐర్లాండ్, ఇరాన్, సౌతాఫ్రికా, జపాన్, ఇండియా వంటి ఎన్నో దేశాల నుంచి అతని మీద ప్రశంసల వర్షం కురిపించారు. వారిలో ఎవరో నెటిజన్ నిక్కీకి ‘రక్షా బంధన్’ పండగ ప్రాముఖ్యత గురించి మెసేజ్ చేశారట. అంతే.. పండగ పరమార్థాన్ని తెలుసుకున్న నిక్కీకి ఈ పండగ జరుపుకోవాలని ఆసక్తి కలిగింది.
రాఖీ పండగను ఏ రోజు జరుపుకుంటున్నారో తేదీ తెలుసుకుని మరీ, ఈ పండగ రోజున బ్రిడ్జర్ చేతికి అతని చెల్లెలితో రాఖీ కట్టించింది. ఆ ఫోటోను కూడా ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. అంతేకాకుండా ఈ పండగ జరుపుకునే నేపాల్, భారత్, బంగ్లాదేశ్ నివాసులందరికీ శుభాకాంక్షలు తెలిపింది. అన్నాచెల్లెలి అనుబంధాన్ని ఇంత గొప్పగా చూపించే పండగ ఒకటి ఉండటం నిజంగా గొప్ప విషయం అని పొగడ్తలతో ముంచెత్తింది. నిక్కీ షేర్ చేసిన ఫొటోను చూసి భారతీయులందరూ ప్రశంసిస్తున్నారు. నిజంగా ప్రాముఖ్యతను గుర్తించి బ్రేవ్ బ్రదర్‌తో సెలెబ్రేట్ చేసినందుకు మెచ్చుకుంటున్నారు.