రిషబ్ పంత్‌ను తిరిగి జట్టులోకి తీసుకోవాలి: బ్రాడ్ హాగ్

by Shyam |
రిషబ్ పంత్‌ను తిరిగి జట్టులోకి తీసుకోవాలి: బ్రాడ్ హాగ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియా-ఆసీస్‌ టూర్‌‌లో భాగంగా టెస్టు సిరీస్‌ ముందు బ్యాటింగ్‌ విషయంలో విమర్శలు ఎదుర్కొన్న రిషబ్ పంత్.. టెస్టు మ్యాచ్‌ విక్టరీ తర్వాత అందరి మన్ననలు పొందుతున్నాడు. ఈ నేపథ్యంలోనే టెస్టు సిరీస్‌లో సత్తా చాటిన రిషబ్‌ పంత్‌పై ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ ప్రశంసలు కురిపించాడు. ఇదే సమయంలో టీమిండియా మేనేజ్‌మెంట్‌కు తన తరఫున రిక్వెస్ట్ చేశాడు. ఈ సిరీస్‌లో తన ప్రదర్శనతో పంత్ బ్యాటింగ్‌‌ను నిరూపించుకున్నాడని.. అందుకే తిరిగి టీ-20, వన్డే మ్యాచ్ స్క్వాడ్‌లో చేర్చాలని కోరాడు. ఆటగాడు మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో పరిమిత ఓవర్ల మ్యాచుల్లో ఆడించాలని బ్రాడ్ హాగ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

Advertisement

Next Story

Most Viewed