క్వారంటైన్‌లో ఉండలేక బాలుడు ఆత్మహత్య

by Shamantha N |
క్వారంటైన్‌లో ఉండలేక బాలుడు ఆత్మహత్య
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా మహమ్మారి మూలంగా ప్రపంచ దేశాలు అతలాకుతలం అయ్యాయి. ఇప్పటికే అనేక కోట్ల మంది వ్యాధి బారిన జీవితాన్ని చిధ్రం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే కరోనా వైరస్ సోకిన వారిని హోం క్వారంటైన్‌లో ఉంచుతున్న సంగతి తెలిసిందే. అందులో ఉండలేక కొంత మంది పారిపోవడం కూడా మనం చూశాం. తాజాగా క్వారంటైన్‌లో ఉండలేక ఓ యువకుడు ఏకంగా ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన కర్నాటకలోని ఉడిపి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే..

పదో తరగతి చ‌దువుతున్న ఓ యువకుడు క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో సాలిగ్రామ‌లో ఉంటున్న త‌ల్లి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చాడు. అతడి త‌ల్లి ఓ ఇంట్లో ప‌ని మ‌నిషిగా వ‌ర్క్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. అయితే ఆమె ప‌ని చేస్తున్న ఇంట్లో ఒక‌రికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ఈ త‌ల్లీబిడ్డ‌ల‌ను హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా అధికారులు సూచించారు.

అయితే బాలుడు మాత్రం కొన్ని రోజులుగా మానసికంగా ఇబ్బంది పడుతూ, క్వారంటైన్‌లో ఉండటానికి ఇష్టపడలేదు. అంతేకాకుండా మంగళవారం బాలుడు బయటకు వెళ్తానంటే అనుమతించక పోవడంతో తీవ్ర నిరాశ చెంది త‌న గ‌దిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు. కుమారుడిని ఆ స్థితిలో చూసిన ఆ తల్లి త‌ల్ల‌డిల్లిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి బాలుడి మృత‌దేహాన్ని పోస్టుమార్టానికి త‌ర‌లించారు. బాలుడు బాగా డిప్రెషన్‌కి లోనై ఇలా చేసి ఉండొచ్చని పోలీసులు బావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed