- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాదులో కూర్చుని మాట్లాడవద్దు: బొత్స
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌లు హైదరాబాదులో కూర్చుని రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదని మంత్రి బొత్స సత్యనారాయణ హితవు పలికారు. విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన కరోనా కేసులను దాచేస్తే దాగుతాయా? అని ప్రశ్నించారు.
ప్రతిపక్ష నేత స్థాయిలో చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని ఆయన అన్నారు. విశాఖపట్టణంలో పాజిటివ్ కేసులను దాచిపెట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని ఆయన తెలిపారు. విశాఖలో పాజిటివ్ కేసులు నమోదు కాకపోయినా అయినట్టు ప్రభుత్వం ఎలా చెబుతుంది? అని ఆయన ప్రశ్నించారు. తాము చెప్పిన కేసులు కాకుండా అదనపు కేసులు ఉంటే చంద్రబాబు తమకు చూపించాలని ఆయన సవాల్ విసిరారు.
కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి బీజేపీ నేత కన్నాకు తెలియకపోతే తెలుసుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 16 కోట్ల మాస్కులు పంపిణీ చేయబోతున్నామని ఆయన గుర్తుచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని ఆయన వెల్లడించారు.
tags: botsa satyanarayana, ysrcp, ap, tdp, babu. lokesh, kanna, visakhapatnam