- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనాపై అవగాహనకు ఈ పుస్తకాలు
దిశ వెబ్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా చిన్న పెద్ద తేడా లేకుండా.. అందరినీ కబళిస్తోంది కరోనా వైరస్. చిన్న దేశాల నుంచి అగ్ర దేశాల వరకు ఎక్కడ చూసినా.. వైరస్ వ్యాప్తి, నియంత్రణ గురించే చర్చే నడుస్తోంది. ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండాలంటే.. ప్రభుత్వ సూచనలు పాటించడం మాత్రమే మనకున్న ఏకైక మార్గం. ఒక వేళ ఈ వైరస్ బారిన పడితే.. మనిషి ఎలా ధైర్యంతో ఎదుర్కొవాలని అనిరుధ్ అరుణ్ అనే రచయిత ‘ప్లాగ్డ్’ అనే పుస్తకం రాశారు. పెద్దవాళ్లు తగు జాగ్రత్తలు తీసుకుంటున్న తరుణంలో, చిన్నపిల్లలకు కూడా కరోనా వైరస్ మీద అవగాహన కల్పించేందుకు ఛండిగఢ్‌కు చెందిన ఇద్దరు ప్రొఫెసర్లు ఒక కామిక్ పుస్తకాన్ని రాశారు. అలాగే చిగురుమళ్ల శ్రీనివాస్ అనే కవి ‘కరోనా శతకం’ రాశాడు.
కోవిడ్ కోరలు చాస్తూ.. ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచ ప్రజలందరినీ తన గుప్పిట్లో పెట్టుకుని కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలోనే కరోనా పై అవగాహనతో పాటు, వాళ్లలో దైర్యం నిలిపేందుకు కొందరు రచయితలు పుస్తకాలు రాశారు. ఆయా పుస్తకాలు ప్రస్తుత వాస్తవిక అంశాలను చూపెడుతూనే.. కరోనాను ఎలా ఎదుర్కోవాలో తెలియజేయడంతో పాటు, ప్రజల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశాయి.
కరోనాపై ఈ -బుక్:
కరోనా మహమ్మారి వివిధ దేశాల్లో ఎలాంటి ప్రభావం చూపించింది, భవిష్యత్తులో ఎలాంటి భౌగోళిక రాజకీయ పరిస్థితులు చోటు చేసుకోబోతున్నాయి, కరోనాతో సంభవించే ఆర్థిక నష్టాలేంటి, ఉద్యోగ కోతలుంటాయా? వంటి సమకాలిన అంశాలతో అనిరుధ్ అరుణ్ అనే రచయిత రాసిన ఈ పుస్తకమే ‘ప్లాగ్డ్’(Plagued). సిలికాల్ వ్యాలీలో నివసించే వేద్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ చుట్టే ప్రధానంగా ఈ కథ తిరుగుతుంది. వేద్ తో పాటు, చైనా, అమెరికాల్లో ఉండే తన స్నేహితులకు కూడా కరోనా వైరస్ సోకుతుంది. వాళ్లు కరోనాతో ఎలా పోరాడారన్నది కథ. మనుషులు ధైర్యం కోల్పోకుండా, నమ్మకంతో ముందుకు సాగితే విజయం వరిస్తుందని అనిరుధ్ అన్నారు. ఇది కేవలం ఈ పుస్తకం మాత్రమే. అమెజాన్ కిండిల్ లో మాత్రమే లభించే ఈ పుస్తకం ధర 149 రూపాయలు. ఈ బుక్ ను అమ్మగా వచ్చే ఆదాయాన్ని పీఎం కేర్స్ కు విరాళంగా అందజేస్తానని చెప్పారు. ఈ పుస్తకాన్ని వైద్య, ఆరోగ్య సిబ్బందికి, అత్యవసర విభాగాల్లో పని చేసే వారికి అంకితమిస్తున్నట్లు రచయిత తెలిపారు.
చిన్న పిల్లల కోసం ‘వాయు’:
ఛండిగఢ్‌కు చెందిన ప్రొఫెసర్లు రవీంద్ర, సుమన్ లు ‘కిడ్స్, వాయు అండ్ కరోనా వూ విన్స్ ద ఫైట్’ పేరుతో ఆన్‌లైన్ కామిక్ పుస్తకం రాశారు. కరోనా వైరస్ మీద పిల్లల్లో అవగాహన పెంచేందుకు ఈ పుస్తకం రూపొందించారు. ఈ పుస్తకంలో ‘వాయు’ అనే సూపర్ హీరో ఉంటాడు. ఆ హీరోనే పిల్లలకు వైరస్ గురించి వివరించడంతో పాటు, తగు జాగ్రత్తలు చెబుతాడు. కరోనా వైరస్ ఎలా వ్యాపిస్తుంది, ఈ వైరస్ సోకితే కనిపించే లక్షణాలు, మన ఒంట్లోకి చేరాక ఏం చేస్తుంది, వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి విషయాలను కామిక్ బొమ్మల ద్వారా పిల్లలకు చక్కగా వివరిస్తాడు. వారికి అవగాహన పెంచుతాడు. ‘కేంద్ర ఆరోగ్య శాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థ వెబ్‌సైట్లలో ఉన్న కొంత సమాచారాన్ని తీసుకొని కామిక్‌లో పొందుపరిచాం’’అని ప్రొఫెసర్ రవీంద్ర తెలిపారు. ‘నేషనల్ కౌన్సిల్ ఫర్ డిసీజ్’ అధికారులు ఈ కామిక్ పుస్తకాన్ని పూర్తిగా చదివి, బాగుందన్నారు. దాంతో ఆరోగ్య శాఖ ఈ పుస్తకాన్ని సీబీఎస్‌ఈ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచింది. www.mohfw.gov.in వెబ్‌సైట్లలోకి వెళ్లి ఈ ఆన్‌లైన్ కామిక్ బుక్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
శతకం:
న్యూయార్క్ లో నివసించే కవి చిగురుమళ్ళ శ్రీనివాస్ ‘కరోనా శతకం’రచించారు. ప్రపంచ దేశాలు కరోనా భయంతో వణకిపోతున్నాయని, ఈ సమయంలో ఆత్మస్థ్తెర్యంతో , క్రమశిక్షణతో యుద్ధం నిర్వహిస్తే గెలుపు తధ్యమని శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. తరతరాలుగా ప్రకృతికి దూరమై కలుషితం చేస్తూ, సర్వజీవులకు కీడు తలపెడుతూ భూమికే ప్రమాదకారిగా మనిషి మారాడని, మనిషికి ప్రకృతి పాఠం చెప్పదలచుకున్నదని ఆ విషయాలనే తన పుస్తకంలో ని పద్యాల ద్వారా చెప్పానని అన్నాడు.
Tags: corona virus, books, ebook, kindle, cbse, plagued, kids, vaayu and corona who wins the fight