3 రాజధానులపై బోండా ఉమా ఘాటు విమర్శలు 

by srinivas |
3 రాజధానులపై బోండా ఉమా ఘాటు విమర్శలు 
X

దిశ, వెబ్ డెస్క్: 3 రాజధానుల వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ఘాటు విమర్శలు చేసారు. మూడు రాజధానులు పెట్టాలని జగన్మోహన్ రెడ్డిని ఎవరు ఎవరడిగారన్నారు. ఎందుకు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మండి పడ్డారు. 14 నెలలుగా ఉత్తరాంధ్రలో ఒక్క రోడ్డు అయిన వేశారా? రాయలసీమలో కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఏ ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశారా? అని ప్రశ్నించారు.

వైసీపీ ప్రభుత్వం 14 నెలల పాలనలో అన్ని విధాలుగా వైఫల్యం చెందిందన్నారు. సంక్షేమ పథకాలు పేదవారికి ఎక్కడా అందడం లేదన్నారు. మొదటి ఎనిమిది నెలలపాటు ఇసుక కొరత సృష్టించారన్నారు. ఇసుక మాఫియా కోసం భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేశారని ఆరోపించారు. ఆనాడు అమరావతి రాజధానిగా 33 వేల ఎకరాలు కావాలని మీరే చెప్పారని గుర్తు చేసారు. స్వార్ధ ప్రయోజనాల కోసమే వైసీపీ మూడు రాజధానుల అంశం తెరమీదకు తెచ్చిందన్నారు.

Advertisement

Next Story

Most Viewed