గుంటూరు పోలీసులపై నమ్మకం లేదు: బొండా ఉమా

by srinivas |
గుంటూరు పోలీసులపై నమ్మకం లేదు: బొండా ఉమా
X

గుంటూరు పోలీసులపై నమ్మకం లేదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. మాచర్ల ఘటనలో విచారణకు రావాలని జారీ చేసిన నోటీసులపై మాట్లాడుతూ, మాచర్లలో తమను హత్య చేసి టీడీపీకి హెచ్చరిక పంపాలని వైఎస్సార్సీపీ చూసిందని అన్నారు. విచారణ పేరిట పిలిపించి, హత్య చేయాలన్న కుట్రకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు తమ ఇద్దరి (బుద్దా వెంకన్న, బోండా ఉమ) కాల్‌డేటాను బహిర్గతం చేయాలని, అలా చేస్తే నిజానిజాలు తెలుస్తాయని ఆయన సూచించారు. వైఎస్సార్సీపీ దౌర్జన్యాలపై ఆధారాలు సమర్పిస్తే రాష్ట్ర ఎన్నికల కమిషన్ గుంటూరు రూరల్ ఎస్పీని బదిలీ చేసిందని, అయితే ప్రభుత్వం అందుకు ఆదేశాలు జారీ చేయలేదని అన్నారు. తన స్వార్థం కోసం జగన్ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. మాచర్ల ఘటనపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని ఆయన తెలిపారు.

tags : bonda uma, tdp, macherla, sec, guntur police, ysrcp

Advertisement

Next Story