- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జమ్ములో బాంబు పేలుళ్లు.. ఎగిరిపడిన విమానాశ్రయం పై కప్పు
దిశ,వెబ్‌డెస్క్ : జమ్ము విమానాశ్రయంలో బాంబు పేలుళ్లు కలకలం సృష్టించాయి. విమానాశ్రయంలో ఐదు నిమషాల వ్యవధిలోనే జంట పేలుళ్లు చోటు చేసుకోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. ఈ పేలుడు ధాటికి విమానాశ్రయం భవనం పైకప్పు ఎగిరిపడింది. దీంతో అక్కడి అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఈ పేలుళ్ల వలన ప్రాణనష్టమేమీ జరగలేదని అధికారులు తెలిపారు. కాగా బాంబు స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందాలు ఘటనాస్థలానికి చేరుకొని తనిఖీలు ప్రారంభిచాయి.
ఈ పేలుళ్లకు రెండు డ్రోన్లు ఉపయోగించినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది. స్థానిక పోలీసులతో కలిసి భద్రతా బలగాలు విమానాశ్రయంలో గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ ఘటన పై రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వైస్ చీఫ్ ఎయిర్ మార్షల్ హెచ్ఎస్ ఆరోరాతో మాట్లాడి ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే ఉన్నతాధికారుల ఆదేశంతో ఎయిర్ మార్షల్ విక్రమ్ సింగ్ జమ్ము వెళ్లనున్నారు.