- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నటి వివాదాస్పద వ్యాఖ్యలు: క్రికెట్ మొదలైందా.. అయితే బట్టలు విప్పేస్తా..
దిశ, వెబ్‌డెస్క్: పూనమ్ పాండే.. 2011 లో క్రికెట్ అభిమానులను ఒక ఊపు ఊపేసిన పేరు. ఇండియా ప్రపంచకప్ గెలిస్తే బట్టలు లేకుండా మైదానంలో తిరుగుతానంటూ పూనమ్‌పాండే చేసిన సవాల్ అప్పట్లో దుమారం లేపిన విషయం తెలిసిందే. ఇక ఆత్రవట ఈ శృంగార తార ఎన్నో విషయాల్లో ఎన్నో వివాస్పద వ్యాఖ్యలు చేసి నెట్టింట్లో ట్రెండ్ సెట్ చేసింది. ఇక రెండేళ్లు డేటింగ్ చేసాక పూనమ్.. డైరెక్టర్ సామ్ బాంబేను గతేడాది లాక్డౌన్ లో పెళ్లి చేసుకొని వివాహబంధంలోకి అడుగుపెట్టి.. పెళ్ళైన 13 రోజులకే భర్తతో విడాకులు కావాలని కోరి మరో సంచలనానికి తెరలేపింది.
తాజాగా ఈ వివాదాస్పద తార మరోసారి క్రికెట్ అభిమానులను రెచ్చగొట్టింది. ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య ఆఖరి మ్యాచ్ ఇంగ్లాండ్‌లోని సౌథాంప్టన్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ గురించి పూనమ్ ని మాట్లాడమని అడగగా.. మరోసారి ఆమె వివాదస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. “క్రికెట్ మొదలైందా..? జనం క్రికెట్ ఆడుతున్నారా..? ఈసారి కూడా భారత జట్టు గెలిస్తే బట్టలు విప్పేస్తానని మళ్లీ చెప్పాలా? అయితే.. ఈ మ్యాచ్ గురించి నాకు తెలియదు. ఇంటికి వెళ్లి తెలుసుకుంటా’’ అని ఘాటుగానే కామెంట్ చేసింది. ఇక ఈ కామెంట్స్ పై స్పందించిన ఆమె భర్త సామ్ బాంబే “వద్దు నువ్వు బట్టలు విప్పకు.. ఈసారి నీకు బదులుగా నేను నగ్న ప్రదర్శన చేస్తా” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో పూనమ్ భర్త నగ్న ప్రదర్శన చేస్తే ఇండియా ఓడిపోతుంది..అలాంటి పని చేయవద్దని తెలిపింది.
ప్రస్తుతం ఈ వివాదాస్పద వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇలాంటి మాటలు మాట్లాడడం తప్పుగా అనిపించడం లేదా.. అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. వారికోసం కూడా నా దగ్గర సమాధానం ఉందన్న పూనమ్ “నా దేశం గెలవాలని కోరుకుంటున్నా.. అందులో తప్పేం ఉంది. క్రికెట్‌ను మన దేశంలో ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. నేను కూడా ఇష్టపడతాను. దేశ ప్రజలకు నేను వినోదం పంచుతున్నాను’’ అంటూ తన వ్యాఖ్యలను సమర్ధించుకుంటుంది. ఏదిఏమైనా ఈ శృంగార తార మాట్లాడే మాటలను పలువురు నెటిజన్లు తప్పుపడుతున్నారు.