కారు, బైక్ ఢీ.. కారులో ఉన్న మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లిన గ్రామస్తులు

by Anukaran |   ( Updated:2021-12-22 02:16:21.0  )
Liquor-Looted
X

దిశ, వెబ్ డెస్క్: బీహార్ లోని గోపాల్‌గంజ్‌ లో బొలెరో వాహనంలో ఉన్న మద్యం బాటిళ్లను గ్రామస్తులు దోచుకెళ్లారు. విదేశీ మద్యం బాటిళ్లను కొందరు వ్యక్తులు యూపీకి చెందిన బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్నారు. బద్రాజీమి వైపు వెళ్తుండగా మహాచా మోడ్ సమీపంలో బైక్‌ను ఢీకొట్టింది. దీంతో అక్కడ వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో బొలెరో వాహనం డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యాడు. వాహనంలో మద్యం బాటిళ్లను గమనించిన గ్రామస్తులు వాటిని దోచుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని స్మగ్లర్ తో పాటు వాహనంలోనుంచి మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లిన 8 మందిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Next Story